రవళి ఇంటి ఎదురుగా క్రొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది.వాళ్ళ అబ్బాయికి సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళు
ఉండొచ్చు.ఉదయం పదిగంటలకు చదువుకోవటానికో,ఉద్యోగానికో బయలుదేరాడు.ఇంతలో వాళ్ళనాన్నప్రధాన
ద్వారం దగ్గర ఆపేసి ఒకదువ్వెన తెచ్చి గబగబా తల దువ్వటం మొదలుపెట్టాడు.కొడుకు వద్దువద్దు అని చేతులు
అడ్డుపెట్టినా వినిపించుకోవటం లేదు.రవళి ఇంట్లో పనిమనిషి అమ్మా ఒకసారి తొందరగా బయటకు రండి అని పిలిచింది.ఏంటోనని బయటకు వెళ్లేసరికి చూడండమ్మా!ఆయన అంతపెద్ద అబ్బాయికి ఎలాతలదువ్వుతున్నారో?
అంది.అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అయినా ఆయన అదేమీ పట్టించుకోవట్లేదు.తలపూర్తిగా దువ్వినతర్వాత మాత్రమే వదిలాడు.ఆతండ్రి అతిప్రేమకు రవళికి నవ్వువచ్చింది.ముచ్చటేసింది.ఈరోజుల్లో అంత తీరికగా ఏతండ్రికొడుక్కి తలదువ్వుతున్నాడు?ఏకొడుకు దువ్వించుకుంటున్నాడు?చిన్నవిషయమే అయినావారి ప్రేమానురాగాలను చెప్పుకోవచ్చు.

No comments:
Post a Comment