Tuesday, 18 February 2014

బ్రహ్మచారి పంతులుగారు

     నిఖిల ఊరికి చిన్నప్పుడు ఒకపంతులుగారు వచ్చి చిన్నపిల్లలకు చదువు చెప్తానని చెప్పాడు.సరేనని అరుగులమీద కూర్చున్న అమ్మలక్కలు వాళ్లపిల్లలను అతనిదగ్గరకు ప్రైవేటుకు పంపించారు.రెండురోజుల
తర్వాత మళ్ళీఅరుగుల దగ్గరకువచ్చి అమ్మానాకింకా పెళ్లికాలేదు వంటచేసుకోవటం కష్టంగా ఉంది.అన్నం
ఎలాగోలా వండుకుంటాను కూరలు పంపించండి అనిచెప్పాడు.సరేనని రోజుకొకళ్ళు కూరలు,చారు,పెరుగు,
పంపించటం మొదలెట్టారు.ఒకనెలరోజులు పోయాక ఆలోచించుకుంటే బ్రహ్మచారిపంతులు చదువు మాట
దేముడెరుగు సుష్టుగా తిని పిల్లలకు చదువు నేర్పకుండా నిద్రపోయి ఒళ్ళుచేశాడు.అమ్మలక్కలందరూ
సమావేశమై మనకు పనిఎక్కువైంది వీడికి సోమరితనం ఎక్కువైంది.అతన్నిమనఊరునుండి పంపించేద్దాము
అనినిర్ణయించుకుని అతని దగ్గరకువెళ్లి నాయనా!నువ్వు మాపిల్లలకు చదువు చెప్పక్కరలేదు ఇక్కడనుండి
వెళ్ళిపో అనిచెప్పారు.సరేనని అతను అక్కడనుండి బిచాణా ఎత్తేశాడు.అతనికి అదిఅలవాటేనని తర్వాత తెలిసింది.
ఇంకానయం నెలరోజులకే అర్థంచేసుకోగలిగాము అనిఅందరూ సంతోషించారు.

No comments:

Post a Comment