మృదుల కుటుంబం షిర్డీ సాయినాధుని దర్శనార్ధం షిర్డీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా మనము మాత్రమే వెళ్ళేకన్నా కుటుంబం మొత్తం కలిసివెళ్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా అత్తింటివారికి,పుట్టింటివారికి ఫోన్లుచేసి ప్రయాణంసంగతి చెప్పగానే ఒకరిద్దరు మినహాయించి అందరూ
వస్తామని ఎగిరి గంతేశారు.ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువరోజులు అక్కడ ఉండటం కష్టం కనుక
మొత్తం చూడకుండానే మూడురోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేశారు.అయినాకూడా షిర్డీ సాయినాధుని దర్శనభాగ్యంతో
కలిగిన దివ్యానుభూతితోపాటు,కుటుంబసభ్యులందరితో కలిసి చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఉన్నముచ్చట్లన్నీ
చెప్పుకుంటూ ప్రయాణించటం,అందరూ కలిసి బాబాను దర్శించుకోవటం వలన మృదుల కుటుంబం ఎంతో సంతోషంతో ఎన్నో మధురానుభూతుల్ని ప్రోగుచేసుకున్నట్లయింది.

No comments:
Post a Comment