లోచన కొడుకు పెళ్ళయి రెండునెలలు అయింది.ఉద్యోగరీత్యా చెన్నయ్ లో ఉంటాడు.కాపురం పెట్టిద్దామని లోచన కోడల్ని,కోడలు చెల్లెల్ని,వియ్యపురాలిని తీసుకుని రైల్లో చెన్నయికి బయల్దేరింది.మగవాళ్ళు బిజీగా
ఉండటంవలన ఆడవాళ్ళు బయల్దేరారు.మిగతావాళ్ళు భయపడుతుంటే లోచన ధైర్యం చెప్పి నాకు నిద్రపట్టదు
అందుకని నేను చూస్తూఉంటానులే మీరు నిద్రపొండి అనిచెప్పింది.లలిత అందరినీ గమనిస్తూ ఉంది.ఒకతను
సీటులో కుర్చోలేనట్లుగా కదలటము సెల్ ఫోనులో ఏదోచూస్తున్నట్లు నటిస్తున్నాడు.లోచనగమనించగా
అర్ధమయినది ఏమిటంటే వాడు అందరూ నిద్రపోతున్నారో లేదోనని సెల్ కెమేరాతో చూస్తున్నాడు.రైలు ఒంగోలు దగ్గరకు వస్తుందనగా నిద్రపోతున్నలోచన కోడలిమెడలోనుండి గొలుసు లాగటానికి పట్టుకున్నాడు.లోచన
మెలుకువగా ఉందనివాడు ఊహించలేదు.లోచన భద్రకాళిలా ఒరేయ్ అంటూ అరిచేసరికి కోడలులేచి దొంగ
దొంగ అనిఅరవటం మొదలెట్టింది.వాడు కంగారుపడి రైలు ఆగుతుండగానే స్టేషన్లో దిగేశాడు.గుర్తుపట్టరనుకొని
రైలు బయల్దేరగానే వేరే భోగీలోనుండి వచ్చి అదే సీటులో కూర్చున్నాడు.ఇదుగోవీడే దొంగ అనిచెప్తే అందరూ తలా ఒకదెబ్బ వేసి టి.సి వస్తే కంప్లైయింట్ రాసుకుని రైల్వే పోలీసులకు అప్పచెప్పమంటే చేస్తాను,చెప్తాను అంటున్నాడు కానీ కదలటంలేదు.మీరు కోర్టుకు వెళ్ళాల్సొస్తుంది అంటూ ఎదోఒకటి చెప్తున్నాడు.ఫిర్యాదు చెయ్యాల్సిందే అంటే ప్రక్క స్టేషన్లో దిగి ఫిర్యాదు చేసి తర్వాత రైల్లో రండి అంటున్నాడు.
లోచనకు ఫోటోలు తీయటం హాబీ.దొంగని,దొంగకూర్చున్నసీటుని,టి.సినిసాక్ష్యానికి చుట్టుప్రక్కలవాళ్ళను ఫోటోలు తీసింది.అప్పుడు టి.సి వచ్చి మీరు తర్వాతయినా ఫిర్యాదు చేసేట్లున్నారు.
దయచేసి డిలీట్ చేయండి మేడమ్ అన్నాడు. పోలీసులకు వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకునేవరకు డిలీట్ చెయ్యను అని చెప్పింది.అప్పుడు పోలీసులను తీసుకొచ్చి వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకున్నారు.అదికాదు మేడమ్ ఫోటోలు డిలీట్ చెయ్యమంటే లోచన అదే మీ కుటుంబానికి ఇదే పరిస్థితి వస్తే
బాద్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తారా? రెండు గంటల తర్వాత మేము దిగిపోతాము మీరెవరో,మేమెవరో మీ డ్యూటీ మీరు సక్రమంగా చెయ్యండి ఆడవాళ్ళు ఏమిచేస్తారులే అని నిమ్మకునీరెత్తినట్లు కూర్చుంటే మీఉద్యోగాలు
ఊడిపోతాయి అంది.మిగిలిన వాళ్ళు కూడా వంతపాడారు.అప్పుడు టి.సి నాది ఈ భోగీలో పని కాదు మీకో నమస్కారం అని వెళ్ళిపోయాడు.

No comments:
Post a Comment