పాల్ వయసు 96 సంవత్సరాలు.అయినా ఎంతో హుషారుగా అందర్నీ తన మాటలతో, చేష్టలతో కడుపుబ్బనవ్విస్తుంటాడు.తన 96 వ పుట్టినరోజు ఇంకా నాలుగురోజులు ఉందనగా అనుకోకుండా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.తన మునిమనుమరాలితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని ఇంటికి వెళ్ళాలని వైద్యురాలిని అడిగాడు.ఆమె పూర్తిగా తగ్గిన తర్వాత పంపుతామని చెప్పింది.అయినాసరే ఆ రోజుకు ఎలాగయినా వెళ్ళిపోవాలని వైద్యురాలిని నువ్వు మంచిదానివి,గొప్ప వైద్యురాలివి అంటూ పొగడటం మొదలుపెట్టి చిన్న పిల్లవాడిలా అల్లరి చేయడం మొదలు పెట్టాడు.90 ఏళ్ల భార్య మాత్రం ఇంటికి తీసుకు వెళ్తే వెంట వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలంటే తనకు కష్టం కనుక పూర్తిగా తగ్గినతర్వాతే ఇంటికి తీసుకువెళ్తానని చెప్పింది.పాల్ పదేపదే చిన్న పిల్లవాడిలా మారాం చేస్తుంటే తప్పనిసరిగా వైద్యులు ఇంటికి పంపారు.
No comments:
Post a Comment