గులాబీలు,బంతి పువ్వులు ఇంటిముందు రకరకాల రంగులతో ముచ్చటగా చూడచక్కగా అందంగా ఉండటమే కాక,ఇంటిలోపల దేవుని పూజకు,అలంకరణకు ఉపయోగపడటమేకాక చర్మకాంతి మెరుగుపరుచుకోవటానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి.అదెలాగంటే ఏ రంగువైనా గులాబీ / బంతి పువ్వులను మెత్తటి పేస్ట్ చేసి దాన్ని ఒక స్పూను తీసుకుని,దానికి సరిపడా పచ్చిపాలు,ఒక స్పూను తేనె కలిపి ముఖానికి రాసి ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.చేతులకు,మెడకు కూడా రాసుకుంటే చర్మకాంతి మెరుగుపడుతుంది.
No comments:
Post a Comment