బీరకాయ - 1 పెద్దది
బంగాళదుంప -1
టొమాటోలు - 2
పచ్చిబఠాణీలు - 1/4 కప్పు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
పుదీనా - 1/2 కట్ట
పసుపు - చిటికెడు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను
కారం - 1/2 టీ స్పూను
గరం మసాలా - 1/2 టీ స్పూను
పెరుగు - 1 టేబుల్ స్పూను
జీరా -1 టీ స్పూను
లవంగాలు - 3
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
యాలకులు - 2
పలవు ఆకు - 1
నూనె ,నెయ్యి కలిపి - 2 టేబుల్ స్పూన్లు
బాస్మతి బియ్యం - 1/4 కేజి
ఉప్పు - తగినంత
ముందుగా బియ్యం కడిగి 1/2 గం.నాననివ్వాలి.ఒకగిన్నెలేక కుక్కర్ లో
కొద్దిగా నూనె వేసి యాలకులు,నానబెట్టిన బియ్యం వేసి 1ని.వేయించి నీళ్ళు పోసి కొద్దిగా బిరుసుగా అన్నం వండాలి.ఒక పాన్ లో నూనె,నెయ్యి వేసి జీరా,లవంగాలు,చెక్క,పలావు ఆకు వేసి వేయించాలి.ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు,పుదీనా వేసి మగ్గనిచ్చి చెక్కు తీసిన బీరకాయ ముక్కలు,బంగాళదుంప ముక్కలు వేయించి ఉప్పు పసుపు,కారం,గరం మసాలా వేసి 2 ని.లు తిప్పాలి.పెరుగు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.అన్నం ఒక బేసిన్ లో వేసి చల్లారాక పై మిశ్రమాన్ని వేసి కలపాలి.మళ్ళీ ఈ మొత్తాన్ని ఒక మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి 10 ని.లు దమ్ చేస్తే రుచికరమైన బీరకాయ వేసిన బిర్యానీ తయారయినట్లే.
No comments:
Post a Comment