ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ సరిపడా ఉండాలి.ఎముకలు విరగకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం ఎండలో కాసేపు ఉండవోయ్!అంటూ మిత్రులు సలహాలు ఇచ్చేస్తుంటారు.సలహా ఇచ్చారని కాదుగానీ నిజంగానే లేలేత ఎండ మన శరీరానికి చాలా మంచిది.సూర్య కిరణాలు మన శరీరానికి తగలగానే చర్మం దానంతటదే డి విటమిన్ తయారు చేసుకుంటుంది.దీనితోపాటు డి విటమిన్ సమృద్దిగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి.పాలు,చేపలు,గుడ్లు,పుట్టగొడుగులు,వెన్న మన ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేగుకాన్సర్ బారి నుండి కూడా తప్పించుకోవచ్చు.
No comments:
Post a Comment