ఈ హడావిడి తీరికలేని జీవనవిధానంలో ఆడవాళ్లయినా,మగవాళ్లయినా తమఆరోగ్యంకోసం ఒకగంట
కేటాయించి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.నడక,సైకిలుతొక్కటం,యోగా,జిమ్ కివెళ్ళటం,సూర్యనమస్కారాలు చేయటం,ప్రాణాయామంచేసుకోవటం,ఎరోబిక్స్,డాన్స్,ఎవరికి నచ్చినవ్యాయామం వారుఎంచుకుని వాళ్లవీలునిబట్టి
చేసుకుంటే బావుంటుంది.మనకు తీరిక లేదులే అనుకోకుండా అదికూడా తప్పక చేయవలసినపని అనుకుని
చేయాలి.నూనె తక్కువవేసిన ఆహారం,పండ్లు,కూరగాయలముక్కలు,మొలకెత్తినవిత్తనాలు తినటం మంచిది.
నీళ్ళు ఎక్కువగా త్రాగాలి.అన్నం తక్కువతిని ఓట్లు,రాగులు,సజ్జలు,జొన్నలు,కొర్రలుతో చేసినపదార్దాలు కూడా
తినటం మంచిది.వారానికి 2,3 సార్లయినా ముడిబియ్యంతో వండినఅన్నం తినటం మంచిది.కేరట్ రసం త్రాగితే
శరీరానికి మంచిమెరుపు వస్తుంది.అనారోగ్యం వచ్చినతర్వాత జాగ్రత్తపడేకన్నాముందే జాగ్రత్తపడటం మేలు.
ఆహారం తీసుకోవటంలో జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేస్తూవుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు చూచుకుంటూ బియంఐ 25 లోపు ఉండేలాచూడాలి.పిల్లలకుకూడా చిన్నప్పటినుండే సరియిన ఆహారపు అలవాట్లు నేర్పించాలి.మెంతులు కూడామన ఆహారంలోభాగం చేసుకుంటే మధుమేహం
రాకుండా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
No comments:
Post a Comment