వనజాక్షి ఒకపల్లెటూరిలో ఉంటుంది.అత్తింటివారి ఆనవాయితీ ప్రకారము రోజూ ఒకగిన్నెలో పాలుపోసి దేవుడి గదిలో పెట్టేవాళ్ళు.కోడలిగా వాళ్ళింట్లో అడుగుపెట్టినప్పుడే గిన్నెలో పాలుపోసి రాత్రిపూట దేవుడి గదిలో పెట్టాలని
చెప్పారు.ఎందుకు?ఏమిటి?అని అడగకూడదు కనుక ప్రశ్నించలేదు.మొదట్లో ఎందుకు పెడుతున్నారో అర్ధంకాలేదు.
అయినా ఒక్కొక్కసారి వనజాక్షి కూడా పెట్టేది.తెల్లవారేసరికి గిన్నెఖాళీగాఉండేది.అసలు ఏమిజరుగుతుందో చూద్దామని ఒకరాత్రంతా మెళుకువగా ఉంది.దేవుడిగది దగ్గరే కాపలా కాసింది.మధ్యరాత్రిలో ఒకనల్లటి తాచుపాము గిన్నెలోపాలు తాగేసి వెళ్ళిపోయింది.తర్వాతిరోజు ఉదయమే భయపడుతూనే వాళ్ళఅత్తగారిని గిన్నెలో పాలగురించి
ఏమవుతున్నాయో కొంచెము చెప్పమని అడిగింది.మనఇలవేల్పు నాగేంద్రస్వామివచ్చి పాలుతాగి వెళ్తారని మా
నమ్మకం అనిచెప్పారు.అప్పటినుండి వనజాక్షి కూడా భయంతోనో,భక్తితోనో రోజు రాత్రిపూట దేవుడి గదిలో గిన్నెలో పాలుపెట్టటం అలవాటు చేసుకుంది.గతరెండున్నర ఏళ్లనుండి పెడుతూనే ఉంది.ఇకముందు కూడా పెడుతూనే ఉంటుంది.

No comments:
Post a Comment