శ్రీమంతిని చదువుకునే రోజుల్లోవాళ్ళ ఊరునుండి కళాశాలకు ఒక పదిమంది కలిసి బస్సులో
వెళ్ళేవాళ్ళు.సృజన శ్రీమంతినికి జూనియర్. చామనచాయతో ఒకమాదిరి అందంతో ఉండేది.సృజనను వాళ్ళ అన్నయ్య న్యాయవిద్య పూర్తిచేసిన ధనవంతుల అబ్బాయికి చెల్లిని ఇచ్చి పెళ్ళి చేద్దామని వాళ్ళింటికి వెళ్ళాడు.వాళ్ళు కుటుంబ స్నేహితులు. మాఅబ్బాయి మీఊరిలో శ్రీమంతిని అనేఅమ్మాయిని ఇష్టపడుతున్నాడు.వాళ్లకు కూడా మా సంబంధం ఇష్టమైతే వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటున్నాము .
అందువల్ల మీరు ఏమీ అనుకోవద్దు అని చెప్పారు.ఆవిషయం సృజన అన్నయ్య ఇంట్లోవాళ్లకు మన ఊరిలో ఉన్న శ్రీమంతినిని చేసుకుందామనే ఉద్దేశ్యం వాళ్ళఅబ్బాయికి ఉందని మాకూఇష్టమేనని ఏమీ అనుకోవద్దని చెప్పారని చెప్పాడు.దాంతో సృజన అహం దెబ్బతిని నన్నుకాదని శ్రీమంతిని అందంగా ఉంటుందని ఆమెను చేసుకుందామని అనుకుంటున్నారా? అలా డైరెక్టుగా ఆమెను చేసుకుందామని చెప్పటమేమిటి? మనం ఎలా కనిపిస్తున్నాము?
అని కోపంతో ఊగిపోయింది.కళాశాలకు వెళ్లి స్నేహితుల దగ్గర శ్రీమంతిని గురించి అవాకులు చెవాకులు పేలింది.
కల్లబొల్లి కబుర్లు చెప్పింది.శ్రీమంతిని కోసం రోజు బస్సులో ఒక లాయరు వస్తాడు.శ్రీమంతిని పుస్తకాలు,హ్యాండ్బాగ్ మోస్తాడు.బస్సులో సీటు అట్టిపెడతాడు అనిచెప్పింది.ఆమెస్నేహితురాలు వచ్చి శ్రీమంతిని అడిగింది.శ్రీమంతిని
వెళ్ళి సృజనను అలా చెప్పటం ఏంటని నాలుగు దులిపేసింది.అవును ఊరికే అబద్దంచెప్పాను.మా అన్నయ్య నన్ను చేసుకోమని వాళ్ళింటికి వెళితే వాళ్ళఅబ్బాయి నిన్నుఇష్టపడుతున్నాడుఅన్నారుఅందుకే అలాచెప్పాను.
నాదే తప్పు సారీ అని చెప్పింది.ఇంకెప్పుడూ ఎవరి గురించీ కల్లబొల్లికబుర్లు చెప్పకు అని సృజనకు శ్రీమంతిని
బుద్ది చెప్పింది.

No comments:
Post a Comment