సుఖద ,చరణ్ భార్యాభర్తలు.ఇద్దరూ తెల్లగా అందంగా ఉంటారు.చరణ్ కోపిష్టి.కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించేది వాడికే తెలియదు.వాళ్ళకు ఇద్దరూ పిల్లలు.అమ్మాయి శ్రీజ,అబ్బాయి శ్రీకర్.ఒకసారి శ్రీకర్ క్రింద పడిపోయాడు.దెబ్బ తగిలింది.చరణ్ ఆఫీసు నుండి వచ్చినతర్వాత ఆవిషయం తెలిసి సుఖదను గదిలోకి తీసుకెళ్ళి చేతులు వెనక్కి కట్టేసి ఒక చేత్తో నోరుమూసేసి చెంపలు గట్టిగా ఎడా పెడా వాయించేశాడు.పిల్లాడిని తల్లి కావాలని ఎత్తి పడేయదు కదా.పిచ్చి ఆవేశంతో శాడిస్టులాగా ప్రవర్తించటంవలన సుఖదమనసు బాధపడింది.
అసలే తెల్లగా ఉన్న సుఖద బుగ్గలు ఎర్రగా కందిపోయి బూరెల్లా అయిపోయినాయి.ఉదయం చరణ్ ఆఫీసుకి
వెళ్ళగానే స్నేహితురాళ్ళకు ఫోనుచేసి బావురుమని ఏడ్చేసింది.వాళ్ళందరూ సుఖద తల్లిదండ్రులకు
చెప్పగానే వాళ్ళు పరుగెత్తుకుని వచ్చారు.సుఖదను మేనత్త కొడుక్కి ఇచ్చారు.అందం ఉండగానే సరిపోయిందా
బుద్దిలేనప్పుడు ఎందుకు?పిల్లలు పడటం సహజం అంతమాత్రాన తల్లిని రాక్షసుడిలాగా కొట్టటమేమిటి?అనిచరణ్ తల్లిదండ్రులను కూడా పిలిపించి మాఅమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతాము అన్నారు.చరణ్
తప్పయింది ఆవేశంలో అలా ప్రవర్తించాను ఇంకెప్పుడూ అలాచేయను అని చెప్పాడు.అటు పెద్దవాళ్ళు ఇటు
పెద్దవాళ్ళు ఆవేశం అనర్ధదాయకం ఇంకెప్పుడూ పిచ్చిపనులు చేయకు అని బుద్ది చెప్పి వెళ్లారు.అప్పటినుండి బుద్దితెచ్చుకుని,ఆవేశాన్నితగ్గించుకుని భార్యను ,పిల్లలను బాగా చూసుకోవటం మొదలెట్టాడు.

No comments:
Post a Comment