మౌర్యన్,మౌనిక భార్యాభర్తలు.ఇద్దరూ విదేశాల్లో వైద్యులు.విదేశాలలో ఎవరిపనులు వాళ్ళే చేసుకోవాలి కనుక వీళ్ళిద్దరూ వైద్యవృత్తిలో తీరిక లేకుండా హడావిడిగాఉంటారు ఎలాగో,ఏంటో అని మౌనిక తల్లిదండ్రులు
ఆందోళన పడుతుంటే మౌర్యన్ తల్లిదండ్రులు మీకు ఆబెంగ అక్కరలేదు అనిచెప్పారు.మా అబ్బాయిని సిల్వియా
తన స్వంత కొడుకు కన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడుతుంది.మా అబ్బాయి కూడా సిల్వియాతో
ప్రేమగా ఉంటాడు.ఏదోఒక సమయంలో మౌర్యన్ కనిపించకపోతే ఆమెకు నిద్రపట్టదు.మౌర్యన్ బిజీగాఉంటే ఆమే
మౌర్యన్ దగ్గరికి వెళ్తుంది."మై సన్,మై సన్" అంటూ ఉంటుంది.ఆమె ఋణం ఈజన్మలో తీర్చుకోలేనిది అనిచెప్పారు.
మౌనిక అక్కడకు వెళ్ళిన తర్వాత కోడలు వచ్చిందని ఎంతో సంతోషపడింది.కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది."మై డాటర్ ఇన్లా"అంటూ అందరికీ చెపుతూ ఉంటుంది.వీళ్ళు హాస్పిటల్ లో రకరకాల పేషెంట్లను చూడాలి కనుక వ్యాధి నిరోధక శక్తి ఉండాలని బలవర్ధకమైన ఆహరం, పానీయాలు తనే స్వయంగా తయారుచేసి ఇద్దరినీ తినాల్సిందే,తాగాల్సిందే అంటూ హడావిడి చేస్తుంటుంది.ఈరోజుల్లో ఇంత ప్రేమగా ఉండటం అరుదు.విదేశాలలో మరీ అరుదు.
ఈ యాంత్రికజీవనయానంలో ఎడారిలో ఒయాసిస్సులా సిల్వియా భగవంతుడిచ్చిన వరం.నిజంగా మేము దగ్గర ఉన్నాఅంత శ్రద్దగా చూడగలిగేవాళ్ళం కాదేమో.ఆమె నిస్వార్ధమైన ప్రేమకు ఒక్కొక్కసారి కళ్ళు చెమర్చుతాయి.
మౌనిక సిల్వియా కబుర్లు చెపుతుంటే ఆమె ఋణం ఎన్నటికీ తీర్చలేనిదిఅని మౌనిక తల్లిదండ్రులు అనుకున్నారు.

No comments:
Post a Comment