జీవన మాధుర్యాన్ని అర్ధం చేసుకొనేందుకు,ఆస్వాదించటానికి కూడా సహృదయం ఉండాలి.
సహ్రుద్భావం సంఘజీవనానికి అంతరాత్మలాంటిది.అప్పుడప్పుడు గాయాలు తగిలినా దానికి వుండే విలువ ఎప్పుడు ఉంటుంది.
దురదృష్టం,విదిప్రాతికూల్యం కొన్ని సందర్భాలలో మానసికశక్తుల్ని కప్పివేసే మాట వాస్తవమే కానీ పోరాడే
స్వభావం ఆతెరలను తొలగించగలదు.
స్వార్థమే కాదు అహం కూడా మనిషిని బానిసగా చేసుకొని అనాగరిక ప్రవర్తనకు దరి చూపుతుంది.అహంభావిని ప్రయత్నపూర్వకంగా కూడా ఎవరూ ప్రేమించలేరు.
జీవితంలో అతిక్లిష్టమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా కావాల్సింది ఆత్మస్థయిర్యం.
ఎట్టిపరిస్థితుల్లోనూ మనల్ని ద్వేషించేవారి ఇక్కట్లను(కష్టాలను),భాదల్ని అవహేళన చేయకూడదు.
జీవితంలో మనోనిగ్రహము,క్రమశిక్షణల అవసరం ఎంతయినా ఉంది.
సుస్థిర ఆర్ధిక భద్రతలకు పొదుపరితనం నిజంగా గుండెకాయ లాంటిది.
నీ విజయాలను నీఅంతట నీవే చెప్పుకోవలసి వస్తే సాధ్యమైనంత తగ్గించి చెప్పుకోవటం మంచిది.
వ్యక్తిత్వమున్న మనిషి ఎప్పుడు నిజాయితీని కాలదన్నకూడదు.కార్యదక్షుడి చేతుల్లో నిజాయితీని మించిన
పదునైన ఆయుధం మరొకటి లేనేలేదు.

No comments:
Post a Comment