Monday, 20 July 2015

పారిజాతం విశేషాలు

                                                       పారిజాతం మొక్క ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో పెంచుతున్నారు.ఈ పువ్వులు రోజూ రాత్రిపూట పూసి ఉదయానికి క్రింద రాలిపోతుంటాయి.పారిజాతం దేవతావృక్షం కనుక ఆ పువ్వులతో భగవంతునికి పూజ చెయ్యటం మంచిది కనుక రాత్రిపూట ఈ మొక్క చుట్టూ ఒక పలుచటి వస్త్రాన్ని పరిచి ఉంచితే ఉదయానికి పువ్వులు రాలిపోయి ఉంటాయి కనుక తేలికగా సేకరించవచ్చు.పారిజాతం పువ్వులు పూజ చేసిన తర్వాత చెత్తలో ఎక్కడంటే అక్కడ పడెయ్యకూడదు.ఒక సంచిలో వేసి నీళ్ళల్లో వెయ్యాలి లేదా మొక్కల మొదలులోవెయ్యాలి. పువ్వులు కాళ్ళతో తొక్కకూడదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment