Friday, 24 July 2015

అంతా దుమ్మే.......

                                              నితీష్ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి విమర్శిస్తుంటాడు.లేకపోతే నిద్రపట్టదు.
ఒకసారి వరుసకు చెల్లెలు అయిన నీరజాక్షి ఇంటికి వచ్చాడు.సోఫాలో కూర్చుని కొంచెంసేపు పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ ఫలహారాదులు పూర్తిచేసిన తర్వాత ఇదుగో సోఫాలోఅంతా దుమ్మే ఉంది అన్నాడు.అసలే నీరజాక్షికి శుభ్రత ఎక్కువ.అదేమిటి?ఉదయమే కదా!పనిమనిషి సోఫాలు తుడిచింది.కోద్దె గొప్పో గాలికి ఏమైనా పడిందేమో!అంది నీరజాక్షి.నేను రోజూతుడిపిస్తాను.మీ ఇంట్లో అసలు తుడవరు కదా!అనేసింది నీరజాక్షి.అదేమిటి అలా మాట్లాడావు?అని భర్త అంటే అంతే కదా!వాళ్ళిల్లు శుభ్రంగా వుంటే ఎదుటివాళ్ళను అన్నాఅదోరకం.వాళ్ళిల్లు ఎప్పుడూ చూసినా ఇంత ఎత్తున దుమ్ముతో నిండి ఉంటుంది.ఎదుటివాళ్లను మాత్రం విమర్సిస్తూ ఉంటాడు.మనం ఏమీ అనకపోతే అసలు తెలియటంలేదు అంది నీరజాక్షి. 

No comments:

Post a Comment