Thursday, 30 July 2015

తల్లిదండ్రులా?రాక్షసులా?

                                                                                వర్ధని తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు.అటువంటిది పదవతరగతి అయిపోగానే తీసుకెళ్ళి పేరున్న కార్పోరేట్  కళాశాలలో హాస్టల్లో చేర్చారు.నాకు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది.నేను ఇక్కడ ఉండలేక పోతున్నాను అని చెప్పినా వినకుండా చచ్చినా బతికినా అక్కడే ఉండాలని అన్నారు.ఒక వారాంతం ఇంటికి వచ్చినప్పుడు వర్ధని పేచీ పెట్టేసరికి గట్టిగా చివాట్లేసి పంపించి వచ్చారు.తర్వాత పిల్లలందరికీ ఇంటిమీద బెంగ ఉంటుందని ఒక పదిరోజులు శెలవులు ఇచ్చారు.అప్పుడు ఇంటికి వచ్చిన వర్ధని అక్కడి వాతావరణం,పద్ధతి నచ్చలేదని,ఇకమీదట వెళ్లనని,ఇంటిదగ్గర నుండి వేరే కళాశాలకు వెళ్తానని మొండిగా కూర్చుంది.వర్ధని చెప్తుంటే అర్ధం చేసుకోకుండా వెళ్ళాల్సిందేనంటూ తండ్రి వాతలు తేలేట్లు కొడుతుంటే తల్లి తిట్లదండకం మొదలెట్టి భర్తను రెచ్చగొట్టి ఇంకా కొట్టమంటుంది.వర్ధని వెళ్తే తిరిగి వచ్చేది లేదు చచ్చిపోతాను అంటే ఫర్వాలేదు నువ్వు పోతే ఇంకొక కూతురు మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని మాట్లాడారు. ఇదంతా చూస్తున్నవింటున్న అమ్మమ్మకు వీళ్ళసలు కన్నతల్లిదండ్రులా?లేక రాక్షసులా?అనిపించింది.మనవరాలి మొండితనమూ నచ్చలేదు.కూతురు,అల్లుడు మూర్ఖంగా ప్రవర్తించడం కూడా నచ్చలేదు.ముగ్గురూ వినే స్థితి దాటిపోయారు.

2 comments:

  1. Chaduvu gnaanni penchelaa undaale thappa premaanubandhaalani disturb cheselaa undakoodadhu...

    --Bharadwaj
    marripallybharadwaj@gmail.com

    ReplyDelete
  2. .అవును,నిజమే.

    ReplyDelete