ఈరోజుల్లో కొంతమంది ఎదుటివాళ్ళ పిల్లలకు వందకు వంద వచ్చినా,తొంభై తొమ్మిది వచ్చినా మనసారా అభినందించలేరు.ఓస్ ఇంతేనా?ఆ!మార్కులది ఏముందిలే?ఇల్లు అలకగానే పండగ కాదు ఆ మార్కులు ఒక లెక్కా! అంటూ తీగలు తీస్తూ మాట్లాడతారు.అదే వాళ్ళ పిల్లలకి వందకు యాభై వచ్చినా తెగ మురిసిపోతూ పేపరు చాలా కష్టంగా ఇచ్చారట మా అమ్మాయికి లేక అబ్బాయికి కనుక ఆ మాత్రం వచ్చాయి ఇంకెవరన్నా అయితేనా!తప్పి కూర్చునేవాళ్ళు అంటూ డప్పు కొట్టి మరీ చెపుతుంటారు.ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మీదేముంది?మాకు వచ్చిందే గొప్ప!ఎదుటివాళ్ళను అభినందించకపోయినా ఫరవాలేదు కానీ ఈసడించినట్లు మాట్లాడకూడదు.అది వాళ్ళ సంస్కారం అని ఎంతగా సరిపెట్టుకుందామని అనుకున్నా అది ముల్లులా ఎదుటివాళ్ళ మనసును గాయపరుస్తూ ఉంటుంది.మనం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నామని చంకలు కొట్టుకున్నా దానితోపాటు కుసంస్కారము అంతకన్నా వృద్ధి చెందుతుంది.ఇది మచ్చుకు మాత్రమే.
No comments:
Post a Comment