రాజీవి మహా మొండి ఘటం.చిన్నప్పటినుండి మొండిగా ప్రవర్తించేది.వయసుతోపాటు మొండితనం కూడా పెరిగింది.మంచైనా,చెడైనా తనకు తోచింది తప్ప ఎవరు చెప్పినా వినిపించుకోదు.అత్తవారింటికి వెళ్ళినా,బిడ్డలు పుట్టినా తన వైఖరి మార్చుకోదు.పైపెచ్చు పిల్లలను కూడా అలాగే తయారు చేస్తుంది.రాజీవి ప్రవర్తనతో విసిగిపోయిన అత్తగారు ఒకసారి వాళ్ళ నాన్న వస్తే మాటలసందర్భంలోఅదేమిటండీ?పిల్లలు పెళ్ళీడు వస్తున్నా తన పద్ధతి మార్చుకోకపోగా పిల్లల్ని మొండిగా తయారుచేస్తే ఎలా? ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నాకు చాలాభాదగాఉందని అన్నారు.నాబాధ ఎవరితో చెప్పుకోమంటారు చిన్నప్పటినుండి ఆమెతో నేను
పడీపడీ నా భారం దించుకున్నాను.మీరు మంచివాళ్ళని మీఇంట్లో ఇచ్చాను.ఆమెతో ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు.అంతే తేడా.చిన్నప్పుడే వినేదికాదు ఇప్పుడు ఇంకేమి వింటుంది?"మొక్కే వంగనిదే మాను వంగుతుందా?"ఇక ఆమె వైఖరి మారదు మనం సర్దుకోవలసిందే?దయచేసి సర్దుకోండి అన్నాడు.

No comments:
Post a Comment