ప్రేమ లత ఉదయాన్నే తలుపు తెరవగానే వరండాలో ఒక మూలగా గుప్పెడు ఎండు వేపాకులు పక్కింటిలో నుండి గాలికి ఎగిరి వచ్చిచేరాయి.విసుగ్గా మొహం పెట్టి వాటిని చేత్తో తీసి చెత్త డబ్బాలో వేద్దామని పట్టుకుంది.ఇంతలో చేతిలో ఎండుటాకు కదిలినట్లుగా అనిపించింది.ఉదయాన్నే ఏదో ధ్యాసలో ఉండి అలా అనిపించిందేమోలే అనుకుని చెత్తలో వేసింది.మళ్ళీ ఆకుల మధ్య కదలిక కనిపించేసరికి ఏంటా?అని చూచేసరికి అచ్చు ఎండుటాకు మాదిరిగానే అదే రంగులో ఉన్న కొంచెం రెక్క తెగిన సీతాకోక చిలుక నిదానంగా ఇవతలకు వస్తుంది.అయ్యో!పాపం సీతాకోక చిలుక ఎండుటాకుల్లో అదే రంగులో కలిసిపోవటం వల్ల చూడలేదనుకొని దాన్ని చెత్త డబ్బాలో నుండి తీసి బయటకు తీయగానే నిదానంగా ఎగిరి వెళ్ళిపోయింది.హమ్మయ్య!పొద్దున్నే ఒక ప్రాణిని కాపాడగలిగానని ప్రేమ లత సంతోషపడింది.
No comments:
Post a Comment