ఖాళీ సమయంలో కారట్ తురిమి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక వారం రోజులు తాజాగా ఉంటుంది.ఒక్కొక్కటి తురుముకోవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.వేపుళ్ళలో వేసినప్పుడు కారట్ వేగీ వేగకుండా తీసేయాలి.దేనిలో వేసినా బాగుంటుంది.దీనికి తోడు పచ్చి బఠాణీ,ఉల్లి కాడలు ఫ్రిజ్ లో అట్టిపెట్టుకుంటే పిల్లలకు రకరకాల వంటలు అప్పటికప్పుడు చేసిపెట్టవచ్చు.రంగు రంగులతో ఉంటే పిల్లలకు చూడటానికి కంటికి ఇంపుగా ఉండటమేకాక అన్నీ వెయ్యటంవల్ల నోటికి రుచిగా ఉండి తినటానికి ఇష్టపడతారు.పెద్దవాళ్ళు కూడా అన్ని రకాల కూరగాయలు తినడం ఎంతో మంచిది.
No comments:
Post a Comment