లక్ష్య ముద్దు పేరు చిక్కీ.పేర్లు మాత్రం ఈ తరానికి తగినట్లు పెట్టుకున్నా గానీ మాటలు,చేష్టలు అన్నీ కూడా వెనుకటి తరంలో కూడా ఉపయోగించని పదాలు ఉపయోగిస్తుంది.వయసు రీత్యా లక్ష్య అమ్మమ్మకు చూపు మందగించింది.అందుకని లక్ష్య అన్నయ్య అమ్మమ్మ బంధువులతోనో,స్నేహితులతోనో ఇంకా ఎవరితోనయినా తేలికగా మాట్లాడటానికి వీలుగా ఉంటుందని అంకెలు పైకి ఉన్న ఒక మామూలు ఫోను కొనుక్కుని ఇంటికి తెచ్చాడు.అంతకు ముందు ఫోను అంకెలు సమానంగా ఉండడంతో తేలికగా అంకెలు గుర్తుపెట్టుకుని అందరి నంబర్లు తనే నొక్కి మాట్లాడేది.అమ్మ ఫోను చేసేది ఎప్పుడయినా ఎందువలన చెయ్యడం లేదు? అని లక్ష్యను అడిగితే ఫోను మిర్రుగా ఉండి నంబర్లు తెలియక చెయ్యడం లేదు అని చెప్పింది.అంటే ఏమిటో ఎదుటివారికి అర్ధం కాక మళ్ళీ అడిగితే మిర్రు అంటే మెరక.దీనికి నంబర్లు పైకి ఉన్నాయి.సమానంగా ఉంటే అమ్మమ్మకు ఫోను చెయ్యటం తేలిక అని లక్ష్య అంది.
No comments:
Post a Comment