Tuesday, 24 January 2017

పిచ్చి బొంద

                                                                      యశోదమ్మ గారికి అరవై ఐదేళ్ళు.ఆవిడ దగ్గర రాజీ చిన్నప్పటి నుండి పని చేస్తుంది.రాజీకి పెళ్ళి చేసి రెండు గదులు ఉండటానికి ఇచ్చికొత్త కాపురం పెట్టించారు.చిన్నతనం నుండి ఆవిడ దగ్గరే ఉండటంతో రాజీకి యశోదమ్మ గారి దగ్గర చనువు ఎక్కువ.ఒకరోజు మైసూర్ బోండా వేసి రాజీ పిల్లలకు పెట్టమని ఒక గిన్నెలో అవసరమైనవన్నీ వేసి కలపమని చెప్పారు.రాజీ పిండి కలుపుతూ అమ్మా!మీరు మైదా బదులు గంజి పిండి వేశారు.పిండి జిగురుగా ఉంది చూడండి అంటూ ఆపకుండా 20 ని.లు నవ్వుతూనే ఉంది.అసలే పెద్ద నోరు.రాజీ నోరంతా తెరిచి కళ్ళ వెంట నీళ్ళు కారేలా నవ్వుతుంటే యశోదమ్మగారు పిండిని పట్టుకుని చూస్తే అది జిగురుగానే ఉన్నా గంజి పొడిలా అనిపించలేదు.ఏది అయితే అయిందిలే అని అది పడేసి మరలా వేరే పిండి కలపమని రాజీకి చెప్పారు.కలిపిన పిండి పడేసిన ఒక పది ని.ల  తర్వాత అది మొక్కజొన్న పిండి అని గుర్తు వచ్చింది.అయ్యో పిండిలో పెరుగు వేసి కలిపి వృధాగా పడేశాము కదమ్మా!అని తెగ బాధపడింది.పిచ్చి బొంద అదేమిటో సరిగా చూడకుండానే ఎప్పుడూ పిచ్చినవ్వులు,అన్నీ పిచ్చి పనులు చేస్తూ ఉంటావు అని రాజీని మెత్తగా మందలించారు. 

No comments:

Post a Comment