జ్యోతిక ఇంటికి వంట చేయడానికి ఒక సహాయకురాలు వచ్చింది.ఒక రోజు జ్యోతిక భోజనం చేసి చేయి కడుగుతున్నప్పుడు వచ్చి అమ్మా!మీరు చేతులు కడిగి కడిగీ భలే తెల్లగా ఉన్నాయని కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది.రేపటి నుండి నేను కూడా చేతులు కడిగితే తెల్లగా వస్తాయా అమ్మా!అని అడిగింది.పిచ్చి ముఖమా!అదే పనిగా కడిగితే చేతులు తెల్లగా రావు.పుట్టుకతో వచ్చిన శరీర ఛాయను బట్టి తెల్లగానో నల్లగానో ఉంటాయి.అంతే కానీ అదే పనిగా కడిగితే చేతులు పాడైపోతాయి జాగ్రత్త అని చెప్పింది జ్యోతిక.
No comments:
Post a Comment