మనఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే మనదగ్గర బంధువులను,స్నేహితులను ఇరుగుపొరుగు వాళ్ళను,తెలిసినవాళ్ళను అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాము.పిలవటంలో కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.కొంతమంది శుభలేఖ కానీ,ఏదైనా ఆహ్వాన పత్రికకానీ ఇచ్చివచ్చేస్తుంటారు.కొంతమంది బొట్టుపెట్టి ఇచ్చినా కూడా వివరంగా చెప్పకుండా వచ్చేస్తారు.ఏశుభకార్యం మొదలుపెట్టినా సరైన పిలుపులు అనేది ఒకపెద్ద ప్రహసనం.అదికూడా ఒకకళ.ఊరిలో ఒకళ్ళో,ఇద్దరో ఉంటే వాళ్ళను వెంటబెట్టుకుని వెళ్తే వాళ్ళు వివరంగా ఎవరిని ఎలా పిలవాలో అలా పిలిచేవాళ్ళు.దగ్గరివాళ్ళను ఎప్పుడెప్పుడు రావాలోచెప్పేవాళ్ళు.బొట్టుపెట్టి కార్డు ఇచ్చి వివరంగా చెప్పి తప్పకుండా రావాలి అని చెప్పాలి.లేని పక్షంలో కార్డు పోస్టులో,కొరియర్ లో పంపించి ఫోనులో చెప్పాలి.ఇప్పటికీ ఊరిలో ఈరోజు ఫలానావారి ఇంట్లో వంట చేసుకోకుండా భోజనాలు అనీ,మగవాళ్ళకు మాత్రమే అనీ వివరంగా ఒకతనితో చెప్పిస్తుంటారు.పిలుపులో ఏదైనా లోపమున్నామళ్ళీ చెప్పిస్తే వస్తారని ఉద్దేశ్యం.సరైన పద్దతిలో పిలవకపోతే,స్త్రీలకు ప్రయాణం అని కార్డులో లేకపోతే ఇప్పటికీ రానివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిలవటం ఒకఎత్తైతే వచ్చిన అతిధులను సాదరంగా లోపలకు ఆహ్వానించి కుర్చోబెట్టడం,ఆప్యాయంగా పలకరించటం,భోజనం చేయమని తీసుకు వెళ్ళటం ఒక ఎత్తు. మన సంప్రదాయం ప్రకారం వచ్చిన అతిధులకు ఏలోటు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది.మనం స్టేజిమీద చేయవలసిన కార్యక్రమాలు ఉంటే మన దగ్గరివాళ్ళకు ఆపని పురమాయించాలి.రాగానే ఎవరూ మాట్లాడకుండా,పట్టించుకోకుండా ఉంటే వచ్చినవాళ్ళ మనసు నొచ్చుకుని అయ్యో!అనవసరంగా ఎందుకు వచ్చామా? అనుకోకూడదు కదా!
అందుకని అక్కచెల్లెళ్ళకో,అన్నదమ్ములకో,బంధువులకో చక్కగా మాట్లాడగల స్నేహితులకో ఆభాద్యత అప్పగించాలి.ఇక మిగిలినది భోజనాల దగ్గర అన్నీ అందరకూ అందుబాటులో ఉన్నాయా,లేదా? అనేది పర్యవేక్షించే బాధ్యత కొంతమంది దగ్గరివాళ్ళకు అప్పగించాలి.గిఫ్టులు ఇవ్వదలిస్తే అందరికీ అందుతున్నాయా?లేదా?చూడటానికి ఇంకొంతమందిని పెట్టాలి.ఆహ్వానించగానే సరికాదు అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి అని పెద్దలు చెప్పేవాళ్ళు.అలాగే ఆహ్వానించటం ఒక్కటే కాదు ముందుగానే పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఏలోటు జరగకుండా అతిధులకు,మనకుకూడా సంతృప్తికరంగా ఉంటుంది.

No comments:
Post a Comment