పచ్చి బియ్యం - 1 కప్పు
అటుకులు - 1/4 కప్పు
కొబ్బరికోరు - 1/2 కప్పు
పాలు - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
రోజ్ ఎసెన్స్ - కొంచెం
సోడాఉప్పు - చిటికెడు
కిస్మిస్,ఖర్జూరం - ముక్కలు తగినన్ని
రెండు కప్పుల పాలు ఒకగిన్నెలో పోసి 1/4 కప్పుఅయ్యేవరకు మరిగించాలి.బియ్యం,అటుకులు
కలిపి వేడిపాలల్లో వేసి పది ని.లు నాననివ్వాలి.చల్లారాక కొబ్బరికోరు కలిపి ఈమిశ్రమాన్ని మెత్తగా వెన్నలా మిక్సీలో రుబ్బుకోవాలి.ఒకగిన్నెలో రెండుకప్పుల పంచదారలో నాలుగు కప్పుల నీళ్ళుపోసిమరగనివ్వాలి.
మరిగేటప్పుడు కొద్దిచుక్కలపాలు చల్లితే అందులో నలకలు ఉంటే పైకి తేలతాయి.అవి తీసేయ్యాలి.ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకకప్పు నీళ్ళు పోసి మరగనివ్వాలి.రుబ్బిఉంచుకున్న బియ్యంలో వంటసోడా కలపాలి.
కొబ్బరిపాలు,అటుకులు ఉండటంవల్ల ఉండలు రాకపోవచ్చు.అందుకని రెండు స్పూనుల నెయ్యివేసి కలిపి ఐదుని.లు ఉంచి అప్పుడు ఉండలు కట్టాలి.ఈమిశ్రమాన్ని ఉసిరికాయ సైజులో చిన్నచిన్న ఉండలుచేసుకోవాలి.
వీటిలో వేలుతో చిన్నరంద్రం చేసి అందులో కిస్మిస్,ఖర్జూరం ముక్కలు పెట్టి మూసెయ్యాలి.
ఈఉండలు ముందుగా చేసి ఉంచుకున్న పాకంలో వెయ్యాలి.ఉడుకుతున్న పాకంలో వేసిన తర్వాత అవి పైకి తేలతాయి.వీటన్నింటినీ విడిగా తీసి పెట్టుకోవాలి.తర్వాత ఈపాకంలో 1/4 కప్పు పంచదార కలిపి అది ఉడికి లేతపాకం వచ్చిన తర్వాత దించాలి.పాకం జిగురుగా లేకుండా ఉండటానికి నీరు పొయ్యాలి.తర్వాత రోజ్ ఎసెన్స్ కలిపి వేయించిన ఉండలు వేసి ఉడికించాలి.వీటిని దించి చల్లారిన తర్వాత సర్వ్ చెయ్యాలి.చాలా రుచిగా ఉంటాయి.
గమనిక :పచ్చిబియ్యం అంటే పంట చేతికొచ్చేముందు కొద్దిగా ఇంటికి తెచ్చి వడ్లుకొట్టి రోట్లో వేసి దంచి బియ్యం చేస్తారు.వాటితో పొంగలి పెట్టి దేము(వు)డికి నివేదన చేస్తారు.ఈబియ్యంతో రసగుల్లాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పటికీ ఊరినుండి పెద్దవాళ్ళు కార్తీకమాసంలో కొత్త బియ్యం నివేదనలకు పంపిస్తారు.

No comments:
Post a Comment