పూర్ణాలు (పూర్ణం బూరెలు) శ్రావణ మాసం ప్రత్యేక వంటకం.పూర్ణాలు లోపలి పదార్ధం బయటకు రాకుండా గుండ్రంగా వెయ్యటం ఒక కళ.ఇవి ఎలా వెయ్యాలో చూద్దామా.
పచ్చి శనగపప్పు - 1/4 కే .జి
బెల్లం - 1/4 కే .జి
యాలకులపొడి - కొంచెం
మినప్పప్పు - 1/2 కప్పు
బియ్యం - 1 కప్పు
నూనె - వేయించడానికి సరిపడా
బియ్యం,మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి.మిక్సీలో అయితే ఒకపూట ముందుగా రుబ్బుకోవాలి.అప్పటికప్పుడయితే పైన గట్టిగా వస్తాయి.మెత్తగా ఉంటే బాగుంటాయి.
పచ్చిశనగపప్పుకడిగి కుక్కర్లో 5,6 విజిల్స్ రానిచ్చి సిమ్ లో 2 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడుకుతుంది.పప్పులో నీరు అసలు లేకుండా ఇగరపెట్టుకోవాలి.పప్పు పూర్తిగా ఉడికినతర్వాత తరిగిన బెల్లం వెయ్యాలి.బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా దగ్గరకు రానివ్వాలి.దించేముందు కొంచెం యాలకుల పొడి వేసి త్రిప్పి ఒక ప్లేటులో ఆరబెట్టుకుని గుండ్రంగా చిన్న చిన్నఉండలు చెయ్యాలి.బాండీలో నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉండను రుబ్బి పెట్టుకున్న పిండిలో ముంచి తీసి వేసే ముందు వేళ్ళ గుర్తులు రాకుండా గుండ్రంగా నిదానంగా నూనెలో జార విడచాలి.వేసిన వెంటనే
కదపకూడదు.లోపలి పప్పు బయటకు వస్తుంది.మీడియం మంటమీద వండుకోవాలి.ఒకటి తిరగేసిన తర్వాత ఇంకొకటి వెయ్యాలి.ఇక గుండ్రంగా,రుచిగా,చూడగానే తినాలనిపించే పూర్ణాలు వెయ్యటం మీకూ వచ్చేసినట్లే.

No comments:
Post a Comment