రుక్మాంగద బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళింది.పెళ్లికొడుక్కి వయసు ఎక్కువే ఉన్నా చిన్నపిల్లల మనస్తత్వం.పెళ్ళికూతురు మరీ చిన్నవయసు కాకపోయినా పల్లెలో పెరిగిన పిల్ల.వీళ్ళ ఇద్దరికీ ఎప్పుడు ఎలా నవ్వాలో,ఎప్పుడు నమస్కారం చెయ్యాలో కూడా తెలియటం లేదంటూ వచ్చిన బంధువులు చూచి ఊరుకోక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అనేకన్నా విమర్శిస్తున్నారని అనుకోవాలి.పాపం ఇలాంటి పిల్లలకు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో బొమ్మల పెళ్ళిళ్ళ మాదిరిగా అంటూ నవ్వుకుంటున్నారు.వింటున్న రుక్మాంగదకు కళ్యాణ మండపంలో ఇవన్నీ మాట్లాడుకోవటం అంత అవసరమా?అనిపించింది.ఇటు పెద్దలు,అటు పెద్దలు ఇష్టమయ్యే ఆపెళ్ళి చేస్తున్నారు.అటువంటప్పుడు మనకు ఎందుకు?అన్నట్లు వీళ్ళందరికీ విమర్శించటం అవసరమా?
సంతోషంగా పెళ్ళికి ఆహ్వానించారు.భోజనం చేసి నాలుగు అక్షింతలు వేసి ఇవతలకు వచ్చేదానికి అక్కడే తిన్నది అరిగిపోయే వరకూ విమర్శనాస్త్రాలు గుప్పించటం ఈరోజుల్లో పరిపాటి అయింది.
సంతోషంగా పెళ్ళికి ఆహ్వానించారు.భోజనం చేసి నాలుగు అక్షింతలు వేసి ఇవతలకు వచ్చేదానికి అక్కడే తిన్నది అరిగిపోయే వరకూ విమర్శనాస్త్రాలు గుప్పించటం ఈరోజుల్లో పరిపాటి అయింది.
No comments:
Post a Comment