ప్రణవ్ మూడు సంవత్సరముల పిల్లవాడు.అల్లరి చెయ్యడంలో దిట్ట.పనివాళ్ళను కూడా చేతిలో ఏది ఉంటే దానితో కొడుతూ ఉంటాడు.పనిఅమ్మాయిని గట్టిగా కొట్టాడు.ప్రణవ్ అమ్మకు కొడుతున్నాడని చెబితే నువ్వే ఏదోచేసి ఉంటావు?లేకపోతే ఎందుకు కొడతాడు?అనేస్తుంది.వాడికి కోపం వచ్చినప్పుడు,ఏదైనా అడిగితే ఇవ్వకపోతే వాళ్ళఅమ్మను కూడా కొట్టేస్తాడు.ఒకరోజు చేతిలో కర్ర ఉంటే కర్రతో గట్టిగా వాళ్ళ అమ్మను చేతిమీద కొట్టాడు.ఎవరినైనా అయితే ఏమీ పట్టించుకోదు.కానీ తనను కొట్టేసరికి కోపం వచ్చి శొంటిక్కలు పెట్టేసింది.అంటే బుగ్గలు పట్టుకుని మెలితిప్పేసింది.తర్వాత చేతి మీది చర్మం పట్టుకుని మెలి తిప్పింది.వాడు ఏడుస్తూ మళ్ళీ కొట్టటానికి అమ్మమీదికి వస్తున్నాడు.ఎప్పుడైతే వేరేవాళ్ళను కొడుతున్నాడో అప్పుడే కొట్టకూడదు అని చెప్పి కంట్రోల్ చేస్తే బాగుండేది కదా!ఇప్పుడు కొట్టడం ఎందుకు?అయినా వాడికి అర్ధం కాదు.అమ్మ కొట్టింది అనుకుంటాడు కానీ ఎందుకు కొట్టిందో అర్ధమయ్యేట్లు చెప్పాలి.ఒకటికి రెండుసార్లు చెబితే పిల్లలు అర్ధం చేసుకుంటారు.చాలామంది తల్లులు చేసే పొరపాటు ఇదే.కొట్టటం వల్ల,విసుక్కోవటం వల్ల ఉపయోగం ఉండకపోగా మొండితనంగా,మూర్ఖంగా తయారవుతారు.అప్పుడు ఏమి ప్రయోజనం?తలనొప్పితప్ప.అందుకే ముందే జాగ్రత్తపడి ఓర్పుతో అర్ధమయ్యేలా తప్పును తప్పని చిన్నప్పటినుండే చెప్పాలి.మనకైతే ఒకటి ఎదుటి వాళ్ళకయితే ఒకటిగా ఉండకూడదు.
No comments:
Post a Comment