ఓం ఓం సాయిరాం ఓం షిరిడి సాయిరాం రండి పాదపూజ చేద్దాము అంటూ అందరినీ పిలుస్తూ జయంతమ్మ వ్రాసుకున్నసాయినాధ సంకీర్తనా కుసుమం
అమ్మల్లారా అయ్యల్లారా రండి రండి రండీ
బంగారు రధమెక్కి బాబా వచ్చె చూడరండీ "అ"గంగా జలముతో గంగి గోవు పాలతో
మంచి గంధమ్ముతో పాదపూజ చేద్దాము "అ"
గులాబీలు గన్నేరు మల్లెలు మందారాలు
సన్నజాజి విరజాజితో అర్చనలే చేద్దాము "అ"
పరమాన్నం పులిహోర పానకం వడపప్పు
ధూప దీపాలతో ఆస్వామిని కొలుద్దాము "అ"
దివి నుండి భువికి దిగి మన ఎదుట నిలిచెనండీ
సాయి శరణం అంటూ సద్గాతినీ పొందండీ "అ"
No comments:
Post a Comment