రాధమ్మ 26 సంవత్సరాల క్రితం ఆరుగురు కుట్టు పనివాళ్ళను పెట్టుకుని వస్త్ర వ్యాపారం మొదలు పెట్టింది.కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈనాటికి ఆరువందల మంది పనివాళ్ళతో ఒక పెద్ద సంస్థగా ఏర్పాటు చేసింది.ఇప్పుడు ఆమె భారదేశంలోనే నెం.1 గా పేరుపొంది చాలా రాష్ట్రాలకు తన వస్త్రాలను అందించగలుగుతుంది.ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్తగా ఎన్నో అవార్డులు అందుకుంది.అయినా కించిత్తు కూడా గర్వం లేదు.69 సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది.ముఖ్యంగా గో సంరక్షణ,రసాయన రహిత వ్యవసాయం చేస్తూ ధాన్యం,కూరగాయలు పండిస్తూ మహిళా వ్యవసాయవేత్తగా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజలను కాన్సర్ వంటి ఎన్నో రోగాల బారినుండి కాపాడాలని సమాజానికి తనవంతు కృషి చేస్తుంది.దీనంతటి వెనుక రాధమ్మ 26 సంవత్సరాల స్వయం కృషి ఉంది.కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిలువెత్తు ఉదాహరణ రాధమ్మ.చెదరని చిరునవ్వుతో,ఎంతో సంస్కారంతో చూడగానే చేతులెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉండే రాధమ్మ పరిచయం ఓ మధురానుభూతి.
No comments:
Post a Comment