జై జై సాయి రాం సాయి సాయి అనగానే కోరి వచ్చాడమ్మా అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
కోరి వచ్చాడమ్మా కొండంత దేవుడువచ్చి కూర్చున్నాడమ్మా వెతలు తీర్చేందుకు "కో"
మదిలోన కోర్కెను మరుక్షణమే తీర్చేను
కలతలు రానీడు మా ఇలవేలుపు "కో"
ఆ కనులు కురియునమ్మా కరుణామృతవృష్టి
పాదములంటిన చాలు ధన్యమౌనీజన్మ "కో"
నామము చేసిన చాలు నాట్యమ్ము చేయునంట
నమ్మి కొలిచిన చాలు కురియును సిరులింట "కో"
No comments:
Post a Comment