ఓం శ్రీ సాయిరాం
సాయినాధుని దర్శించుకుని మనసందుకే మురిసింది అంటూ వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమం
మనసందుకే నేడు వేడుకలా మురిసింది
ఏడేడులోకాలు సాయితో తిరిగింది
ఆసాయి చరణాల ధూళినయ్యాననో
ఆస్వామి రూపాలు చూచి మురిశాననో "మ"
ముక్కోటి దేవతలు నవ గ్రహాలు
పంచ భూతాలు అష్ట దిక్పాలురు
ఎవరైతేనేమి ఏ లోకమైతేనేమి
ఆస్వామి ఆజ్ఞలో నడుచువారేననీ"మ"
పత్రమైననుగానీ పుష్పమైననుగానీ
ఫలములైననుగానీ ఉదకమైననుగానీ
భక్తితో ఇచ్చునది ఏమైనగానీ
ఆ తండ్రి ప్రీతితో స్వీకరించును అనీ "మ"
ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో
నీవువెలసినచోటు నేగాంచుచున్నాను
ఎన్ని జన్మలనుండో నీతోనే ఉంటున్నా
ఈజన్మలోనే అది తెలియుచున్నది అనీ "మ"
సాయినాధుని దర్శించుకుని మనసందుకే మురిసింది అంటూ వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమం
మనసందుకే నేడు వేడుకలా మురిసింది
ఏడేడులోకాలు సాయితో తిరిగింది
ఆసాయి చరణాల ధూళినయ్యాననో
ఆస్వామి రూపాలు చూచి మురిశాననో "మ"
ముక్కోటి దేవతలు నవ గ్రహాలు
పంచ భూతాలు అష్ట దిక్పాలురు
ఎవరైతేనేమి ఏ లోకమైతేనేమి
ఆస్వామి ఆజ్ఞలో నడుచువారేననీ"మ"
పత్రమైననుగానీ పుష్పమైననుగానీ
ఫలములైననుగానీ ఉదకమైననుగానీ
భక్తితో ఇచ్చునది ఏమైనగానీ
ఆ తండ్రి ప్రీతితో స్వీకరించును అనీ "మ"
ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో
నీవువెలసినచోటు నేగాంచుచున్నాను
ఎన్ని జన్మలనుండో నీతోనే ఉంటున్నా
ఈజన్మలోనే అది తెలియుచున్నది అనీ "మ"