Tuesday, 3 January 2017

గతిలేక

                                                                 సరస్వతమ్మ గారికి ఒంట్లో బాగోలేదని బంధువుల ఆసుపత్రికి వెళితే వైద్యులు అన్ని పరీక్షలు చేద్దాము రెండు రోజులు ఆసుపత్రిలో ఉండమని చెప్పారు.సరేలే ఉదయాన పరగడుపున చేసే పరిక్షలు ఉంటాయి కదా!అని ఆసుపత్రిలో ఉన్నారు.బంధువులు కనుక ఒక మంచి గది ఇచ్చి రోగులకు రోజూ  వేడివేడిగా  భోజనం సిద్ధం చేస్తారు కనుక సరస్వతమ్మ గారికి,ఆమె భర్తకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.వైద్యులు అన్ని రకాల పరిక్షలు చేసి అంత బాగానే ఉంది కానీ కొద్దిగా నీరసంగా ఉన్నారు కనుక నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు.ఆసుపత్రిలో పనిచేసే ఆమెను నాలుగు రోజులు ఇంటికి వచ్చి సహాయం చేయమని అడిగితే వచ్చింది.ఆమెకు కాస్త నోటి దురుసు.సరస్వతమ్మ గారి ఇంటికి వచ్చి కంచాలు,గ్లాసులు కూడా వేడి నీళ్ళతో కడిగే యంత్రంలో పెట్టి తీస్తున్నారు.ఇంట్లో ఇంత శుభ్రంగా ఉండి ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడి భోజనం చేశారు.గతిలేక ఎవరూ భోజనం పంపే దిక్కులేక తిని ఉంటారు అనేసి సరస్వతమ్మ గారు వచ్చేసరికి మనసులో అనుకునే మాట పైకే అనేశానని నాలుక కరుచుకుంది.

No comments:

Post a Comment