ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జయంతమ్మ మనసారా సాయి స్మరణ చేయండీ అంటూ వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమం భక్తులారా భజన చేయండీ
మనసారా సాయి స్మరణ చేయండీ " భ"కలియుగంబున వెలసినాడండీ షిరిడీ వాసుడు
చిత్ర విచిత్రాలు చేసినాడండీ"భ"
ఎవరి పనులు వారు చేయండీ మదిలోన
మరువకుండా సాయి స్మరణ చేయండీ "భ"
మాయ మర్మములేవీ లేవండీ రెండక్షరమ్ముల
సాయి సాయి అని నామ స్మరణ చేయండీ "భ"
కోరిన వారి కొంగు బంగారం మన సాయి దేవుడు
జ్ఞాన ధనమును కోరి పొందండీ "భ"
కాలమెప్పుడూ తిరిగి రాదండీ క్షణమైన మీరు
సాయి నామస్మరణ మరిచిపోకండీ "భ"
No comments:
Post a Comment