వేసవిలో ఎండలకు తోడు పెళ్ళిళ్ళు,వేడుకలు ఎక్కువగా ఉంటాయి.విందు భోజనంలో ఎక్కువగా నూనె,మసాలాలు,నేతితో చేసిన తీపి పదార్ధాలు తింటాము.ఎంత తక్కువగా తిన్నాఆతర్వాత ఎంతో కొంత కడుపులో మంట వస్తుంటుంది.అటువంటప్పుడు ఉప్పు వేసిన మజ్జిగ తాగితే తగ్గిపోతుంది.మాములుగా ఉప్పులేని మజ్జిగ తాగితే బి.పి అదుపులో ఉంటుంది.మజ్జిగ నేరుగా తాగే కన్నా కొంచెం కొత్తిమీర ,జీరా,అల్లం,పచ్చిమిర్చి,కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగితే రుచితో పాటు జీర్ణశక్తి మెరుగు పడటమేకాక శరీరానికి చలువ చేస్తుంది.
No comments:
Post a Comment