అవినాష్ కు ఐదు సంవత్సరాలు.కానీ మొద్దు పిల్లాడు.అక్కను చెలకొట్టనివ్వడు.
వాడి దగ్గరనుండి ఏమైనా తీసుకుందా?జుట్టు పట్టుకుని కొట్టేస్తాడు.వాడికి నచ్చనిది ఎవరైనా ఏమైనా ఇచ్చినా నిర్మొహమాటంగా తిరిగి ఇచ్చేస్తాడు.ఒకరోజు వాళ్ళ అమ్మ స్నేహితురాలు చిన్న పిల్లాడు కదా ఒట్టి చేతులతో ఏమి వస్తాములే అని ఒక బొమ్మ తెచ్చింది.అది అవినాష్ కి నచ్చలేదు.అవినాష్ బొమ్మను తిరిగి ఆమెకు ఇచ్చేసి నీకంటే
ఏమి బొమ్మ తీసుకురావాలో తెలియదనుకో?నీ కొడుక్కి తెలియదా?అన్నాడు. అమ్మ స్నేహితురాలు కొడుక్కి పది సంవత్సరాలు.అవినాష్ అలా మాట్లాడేసరికి ఆమెకు ఏమి మాట్లాడాలో అర్ధంకాలేదు.అలా చూస్తూ ఉండి పోయింది.
No comments:
Post a Comment