నీరజ స్కూల్లో చదువుకునే రోజుల్లో తోటి విద్యార్ధిని తరగతిలో అందరినీ నాకు కొంచెం చీమల మందు తెచ్చిపెట్టరా?అని అడిగేది.ఎందుకు?అని అడిగితే తిని చచ్చిపోతాను అనేది.చచ్చిపోవాల్సిన అవసరం ఏమిటి?అంటే ఆమె చెప్పినది వింటే మనకు చాలా చిన్న కారణంగా అనిపిస్తుంది.కానీ ఆమెకు చాలా బాధ కలిగించే పెద్ద కారణం.అదేమిటంటే ఆమె మోచేతులు గరుకుగా,నల్లగా ఉన్నాయట.అది ఎలా పోతుందో తెలియక దిగులుతో అందరినీ అలా అడుగుతుంది.అప్పుడు అందరూ చిన్నపిల్లలే.ఏమిచెప్పాలో తెలిసేది కాదు.ఆమె అడుగుతుంటే బాధగా ఉండి నీరజ వైద్యుని దగ్గరకు వెళ్ళు అని సలహా ఇచ్చింది.ఇప్పుడు నిమ్మకాయను చూచినప్పుడల్లా ఆమె గుర్తు వస్తుంటుంది.నిమ్మ చెక్కపై కొంచెం తేనె అద్ది మోచేతులపై రోజూ10 ని.లు రుద్దితే గరుకుదనం,నలుపుదనం పోయి చేతి చర్మం రంగులోకి వస్తుంది.
No comments:
Post a Comment