తెల్లవారుఝామున నిద్రలేస్తే మంచిది.ఆసమయంలో ధ్యానం,పూజ,యోగా,ఏపని చేసినా ఆతర్వాత చేసే పనికన్నా ఎక్కువ ఫలితం పొందవచ్చు.నిద్ర లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలి.కంగారుగా ఆందోళనతో లేవకూడదు.మనం నిద్రలేచే ముందు ఏవిధంగా లేస్తే ఆరోజంతా అదేవిధంగా ఉంటుంది.ప్రశాంతంగా నిద్రనుండి మేల్కొన్న తర్వాత రెండు అరచేతుల్ని చూచి కళ్ళపై పెట్టుకోవాలి.అరచేతుల్లో దేవతలుంటారు.తర్వాత దేవుని ఫోటోచూడవచ్చు.క్రిందికి దిగే ముందు మనం కాళ్ళతో భూదేవిపై నడుస్తుంటాము కనుక రెండు చేతులతో భూదేవుని తాకి కళ్ళకద్దుకుని నమస్కరించుకుని అమ్మా!మాపాదస్పర్శను మన్నించమ్మా!అంటూ నిద్రలేవాలి.వస్తే శ్లోకాలు చదువుతూ చేసుకోవచ్చు.లేకపోయినా పైవిధంగా చేయవచ్చు.తర్వాత దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి.
కాళ్ళపై కాదు కళ్లపై :-)
ReplyDeleteఅక్షర దోషాన్ని సరిదిద్దినందుకు కృతజ్ఞతలు.
ReplyDelete