మామిడికాయలు - 4
కారం - 4 టీ స్పూనులు
ఉప్పు - 3 టీ స్పూనులు
మెంతు పిండి - 2 1/2 టీ స్పూనులు
ఆవపిండి - 1 1/2 టీ స్పూను
పసుపు - 1 టీ స్పూను
వెల్లుల్లి పాయలు - 2
నూనె - సరిపడా
కారం - 4 టీ స్పూనులు
ఉప్పు - 3 టీ స్పూనులు
మెంతు పిండి - 2 1/2 టీ స్పూనులు
ఆవపిండి - 1 1/2 టీ స్పూను
పసుపు - 1 టీ స్పూను
వెల్లుల్లి పాయలు - 2
నూనె - సరిపడా
మామిడికాయలు చెక్కు తీసి సన్నగా చిన్న ముక్కలు కోసుకోవాలి.మెంతులు వేయించి పొడిచేసుకోవాలి.ఆవపిండిచేసుకోవాలి.మామిడికాయముక్కలు,ఉప్పు,కారం,మెంతుపిండి,ఆవపిండి,పసుపు,కొంచెం నూనె,వెల్లుల్లి అన్నీ కలపాలి.వెల్లుల్లి దంచి వేయవచ్చులేదా కొంచెం దంచి,కొంచెం ముక్కలు వేసుకోవచ్చు.రెండు గం.ల తర్వాత ఒకసారి కలిపి సరిపడా నూనె కలిపితే రుచిగా ఉంటుంది.బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు బాగుంటుంది.ఫ్రిజ్ లో అయితే ఒక 15 రోజులు బాగుంటుంది.
గమనిక:ఈ పచ్చడిలో వేయించిన వేరుశనగ పప్పుల పొడి కానీ,వేయించిన నువ్వులపొడి కానీ కలుపుకోవచ్చు.
విభిన్నంగా చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయత్నించవచ్చు.విభిన్న రుచులతో బాగుంటుంది.
గమనిక:ఈ పచ్చడిలో వేయించిన వేరుశనగ పప్పుల పొడి కానీ,వేయించిన నువ్వులపొడి కానీ కలుపుకోవచ్చు.
విభిన్నంగా చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయత్నించవచ్చు.విభిన్న రుచులతో బాగుంటుంది.
No comments:
Post a Comment