భూమిత శెలవులకు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళింది.మధ్యాహ్నం భోజనంచేసిన తర్వాత అమ్మమ్మ స్నేహితురాళ్ళు అందరూ అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చి చీరలపై రకరకాల డిజైన్లు కుట్టుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు.ఈ కబుర్లన్నీ ప్రక్కింటివాళ్ళు పునశ్చరణ చేసేవాళ్ళు.పొరుగింటి కిటికీ దగ్గర ఇంట్లోవాళ్ళు ఎవరో ఒకరు కూర్చుని వీళ్ళు మాట్లాడే ప్రతిచిన్నమాట వదలకుండా ఇంకొకరికి చెప్పేవాళ్ళు.వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఇంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు.వాళ్లకు అదొక దురలవాటు.భూమిత తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ ఏమిటి అమ్మమ్మా?మీరు మాట్లాడే ప్రతీమాట ప్రక్కింట్లో నుండి మళ్ళీ వినపడుతుంది అంది.ఔనమ్మా!వాళ్లకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు.అందుకే అలా ప్రవర్తిస్తుంటారు.ప్రక్కింటి విషయాలు వినటం తప్పు.మళ్ళీ పక్కవాళ్ళకు చెప్పటం ఇంకో తప్పు.సంస్కారం లేనివాళ్ళకు చెప్పినా అర్ధం కాదు అంది అమ్మమ్మ.ఇకమీదట రహస్యంగా పక్కింటి వాళ్ళకు వినిపించకుండా మాట్లాడుకోండి అమ్మమ్మా!అంది భూమిత.మనం కూడా ఈతరంలాగా చరవాణిలో సందేశాలు పెట్టుకోవాలేమో?హ్హ హ్హహ్హ అంటూ మేలమాడారు అమ్మమ్మ స్నేహితురాళ్ళు.
No comments:
Post a Comment