ఉమేష్ 12 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్ళమంటే తలనొప్పి వచ్చిందని మెలికలు తిరిగి శోకాలు పెట్టేవాడు.ఇంకేముంది నిజంగానే తలనొప్పి వచ్చిందనుకుని అమ్మమ్మ,అమ్మ ఉమేష్ ని చంక నేసుకునే వాళ్ళు.అప్పటికే ఉమేష్ పొడవుగా ఉండేవాడు.ఎత్తుకుంటే కాళ్ళు నేలకు తగులుతుండేయి.అయినా పాపం పిల్లాడు నొప్పితో విలవిలలాడిపోతున్నాడని ఎత్తుకునేవాళ్ళు.ఏ వైద్యుని దగ్గరకు తీసికెళ్లినా అన్ని పరీక్షలు చేసి ఏ అనారోగ్యం లేదని తేల్చారు.అయినా తలనొప్పి తగ్గలేదనేవాడు.ఉమేష్ కు వరుసకు పెదనాన్నఅమెరికాలో పిల్లల వైద్యుడు.ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు ఉమేష్ ని తీసుకొచ్చి చూపించారు.ఆయన ఉమేష్ ని పరీక్ష చేసి వీడికి తలనొప్పి ఏమీ లేదు వేషాలు వేస్తున్నాడని,పాఠశాలకు వెళ్ళాల్సిందేనని,లేకపోతే ఊరుకోవద్దని తల్లిదండ్రులకు చెప్పారు.ఉమేష్ కి కూడా అదే విషయం గట్టిగా చెప్పారు.అప్పటినుండి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకుని ఇంజనీరయ్యాడు.చిన్నప్పుడు ఎన్ని వేషాలు వేసినా ఇప్పుడు కుటుంబం మొత్తంలో పెద్ద పెత్తనగాడు అయ్యాడు.ఇంటాబయటా అందరికీ తలలో నాలుకలా సలహాలిస్తూ పనులు చక్కబెడుతుంటాడు.
No comments:
Post a Comment