సోయా గ్రాన్యూల్స్ కూరల్లో వేసుకోవటమే కాక రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.అందులో ఇది ఒక రకం.మీరు కూడా ప్రయత్నించండి. సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు
ఉల్లి తరుగు - 1/2 కప్పు
ఉల్లి తరుగు - 1/2 కప్పు
టొమాటో ముక్కలు 1/2 కప్పు
చాట్ మసాలా- 1 స్పూను
గరం మసాలా - 1 స్పూను
పచ్చిమిర్చి - 5
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత
ఎండు మిర్చి - రెండు
మినప్పప్పు - 1 స్పూను
జీరా - 1 స్పూను
నూనె - 1 టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు - 2 స్పూనులు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూనులు
సన్న కారప్పూస - తగినంత (ఇష్టమైతే)
సన్న కారప్పూస - తగినంత (ఇష్టమైతే)
మినప్పప్పు,ఎండు మిర్చి,జీరా,1 టేబుల్ స్పూను సోయా గ్రాన్యూల్స్
నూనె లేకుండా బాండీలో వేయించుకోవాలి.చల్లారాక పొడి చేయాలి.మిగిలిన సోయా గ్రాన్యూల్స్ మునిగేవరకు నీళ్ళు పోసి 5 ని.లు ఉడికించి నీళ్ళు వంపేసి చల్లటినీళ్ళు పోసి గట్టిగా పిండి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలోనూనె వేడిచేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి,టొమాటో ముక్కలు,అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక సోయా గ్రాన్యూల్స్ వేసి సరిపడా ఉప్పు వేసి కలపాలి.తర్వాత గరం మసాలా,చాట్ మసాలా పొడి చేసిన సోయా పిండి వేసి మూతపెట్టాలి.కాసేపటికి అది పొడిపొడిగా తయారవుతుంది.కొత్తిమీర తరుగు,నిమ్మరసం వేసి ఒకసారి కలపాలి.సన్న కారప్పూస ఇష్టమైతే కలుపుకోవచ్చు. కరకరలాడుతూ బాగానే ఉంటుంది.సోయా గ్రాన్యూల్స్ తో రుచికరమైన చాట్ తయరయినట్లే.
No comments:
Post a Comment