మహిళలూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.సహజంగా మహిళలు ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం గురించి తీసుకున్నంత శ్రద్ధ తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి తీసుకోరు.అదీకాక పురుషుల కన్నా స్త్రీలలో గుండెపోటు లక్షణాలు అంతగా బయటకు తెలియవు.దాంతో గుర్తించడం కూడ కష్టమైపోయి మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి.పురుషుల్లో గుండెపోటు వస్తే ఛాతీలో నొప్పి,చెమటలు పట్టడం స్పష్టంగా తెలుస్తుంది.స్త్రీలలో ఒక్కొక్కసారి అసలు నొప్పి కూడా తెలియకపోవచ్చు.ఒకవేళ ఏదైనా నొప్పిగా అనిపించినా దానిదేముందిలే!అదే తగ్గిపోతుందని పెద్దగా పట్టించుకోరు.తేలిగ్గా కొట్టిపారేయకుండా వైద్యుని వద్దకు వెళ్ళాలి.మహిళలు ఎప్పుడూ బరువును,రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.ప్రతి సంవత్సరము కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయించుకుంటే పది సవత్సరాల ముందే ఏదైనా తేడా ఉంటే గుర్తించి వ్యాధిని అరికట్టవచ్చు.రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.ఎప్పటికప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరిగా చేయాలి.ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకునే కన్నా ముందే మేల్కొని వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అందరికీ శ్రేయస్కరం,ఇంటికి దీపం ఇల్లాలే కనుక ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే ఇంటికి వెలుగు.అప్పుడే కుటుంబం మొత్తం బాగుంటుంది.
No comments:
Post a Comment