ఇషిక స్వంతఊరిలో రామాలయాన్ని పునర్నిర్మించి ద్వజస్తంభం ఎత్తారు.ఏఆలయనికయినా ద్వజస్తంభం
ముఖ్యం.ద్వజస్తంభం ఎత్తినప్పుడు ఆఊరిఆడపిల్లలను పుట్టింటికి పిలిచి బట్టలు పెట్టటం ఆనవాయితీ.ఆరోజు ఆలయానికివెళ్ళి దైవదర్శనం చేసుకుని పుట్టింటివాళ్ళు పెట్టినచీర కట్టుకుని భోజనంచేయాలని లేకపోతే పన్నెండు
సంవత్సరాలు పుట్టింటి వాళ్ళతో పసుపు,కుంకుమ పెట్టించుకోకూడదని పెద్దలు చెపుతుంటారు.అందుకని తప్పనిసరిగా ఆడపిల్లలందరూ ఊరికి వెళ్తారు.ఇషిక కూడా అలాగే ఊరు వెళ్ళింది.తనతో చదువుకున్నచిన్నప్పటి స్నేహితులు,బంధువులు అన్నితరాలవాళ్ళు ఆలయప్రారంభోత్సవానికి వచ్చారు.వాళ్లందరూ చాలాసంవత్సరాల
తర్వాత కనిపించటంవలన ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఇషికను చూచి అందరూ చాలాచాలా
సంతోషించారు ఎందుకంటే చిన్నప్పటినుండి ఇషిక అంటే అందరికీ ఇష్టం.దీక్షతీసుకుని కొంతమంది దంపతులు ప్రారంభోత్సవపూజలు,హోమాలు చేసినవాళ్ళు తప్ప సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆలయం
లోపలకు ఎవరినీ పంపించలేదు.అయినా ఇషికవాళ్ళను లోపలకు అనుమతించటంవలన దగ్గరనుండి కళ్యాణం
చూడటంవల్ల చాలా సంతోషం కలిగింది. ఆవుదూడ మూలవిరాట్టుల దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మిగతావాళ్ళు దర్శనం చేసుకోవాలి కనుక ఆతర్వాత దైవదర్శనం చేసుకున్నారు.ఆలయం తరఫున మూడురోజులు భోజనాలు ఏర్పాటు చేశారు.దేవుడి భోజనం తప్పనిసరిగా చేయాలి కనుక,ద్వజస్తంబం ఎన్నోఏళ్లకు ఒకసారి ఎత్తుతారు కనుక దూరప్రాంతాల వాళ్ళు కూడా వచ్చారు.

No comments:
Post a Comment