లక్ష్మినల్లగా ఉంటుంది.పుట్టిన ఊరిలో" నల్లలక్ష్మి"అనిపిలిచేవాళ్ళు.అత్తగారి ఊరిలో కూడా అలాగే
పిలవటం మొదలుపెట్టారు.పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యేవరకు ఊరుకుంది.ఉన్నట్లుండి ఏమయ్యిందో ఏమో ఒక
పెద్దావిడ నల్లలక్ష్మి అని పిలిచిందట.అప్పుడు అందరి ఎదుట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళినతర్వాత ఫోనుచేసి
ఒకగంట ఏకధాటిగా నన్ను నల్లలక్ష్మి అని పిలుస్తావా?అంటూ పోట్లాట వేసుకుంది.పెద్దావిడకు తలకాయవాచిపోయి వాకిట్లో అరుగుమీద కూర్చుని వచ్చేపోయే జనాలను పిలిచిమరీ అందరూ పిలిచినట్లుగానే నేను పిలిచాను.ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా పిలిపించుకుని ఇప్పుడు ఆపేరు అలవాటయిన తర్వాత ఇకనుండి పిలవొద్దు
మామ్మాఅనిచెప్పకుండా,పెద్దదాన్నని చూడకుండా మాట్లాడిందని వాపోయింది.మొదటినుండి పిలిపించుకోవటం లక్ష్మితప్పు.దేవుడిచ్చిన రూపానికి లక్ష్మిని బాధపెట్టకూడదు.ఇంతకుముందు రోజుల్లో నలుగురైదుగురు ఒకేపేరుతో ఉంటే నల్ల,తెల్ల,సన్న,లావు అంటూ పిలిచేవాళ్ళు.ఈరోజుల్లో ఎక్కువమంది ఉంటే ఇంటిపేరుతో పిలుస్తున్నారు. కాలంమారిందికదా!నామట్టుకు నేను ఎవరినీ విమర్శించను,బాధపెట్టను.ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో రాసినదికాదు.ఇలా పిలిస్తే అలా రియాక్టవుతారని,వాళ్ళ మనసుని బాధపెట్టినట్లవుతుందని తెలియచేప్పటమే నాఉద్దేశ్యం.
కొసమెరుపు:ఇంతకుముందు రోజుల్లో పెద్దవాళ్ళంటే భయం,భక్తీ,గౌరవం అన్నీఉండేయికనుక ఏదిపడితే అది
పిల్లలు మాట్లాడేవాళ్ళుకాదు.పెద్దవాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు.ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కనుక ఏదిపడితే
అది మాట్లాడటం ఫ్యాషనయి పోయింది.

No comments:
Post a Comment