శ్రీధరణి బంధువులలో ఒకపెద్దాయన విదేశాలనుండి భార్యతో కలిసి స్వంతఊరికి వచ్చాడు.తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీధరణి ఇంటికి వచ్చివెళ్తామన్నారు.ఇంతలో శ్రీధరణి భర్త అర్జంటు పనిమీద స్వంతఊరికి
వెళ్ళాల్సొచ్చింది.పెద్దాయనకు ఫోనుచేసి నేను తప్పనిపరిస్థితులలో ఊరికి వెళ్ళాల్సొచ్చింది అందుకని బాబు విమానాశ్రయానికి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాడు ఏమీ అనుకోవద్దు అనిచెప్పారు.తరువాత ఎన్నిగంటలకు వస్తున్నారని శ్రీధరణి ఫోనుచేస్తే పెద్దాయన మేము మీఇంటికి రావటంలేదు విమానాశ్రయం దగ్గర హోటల్ లో విశ్రాంతి తీసుకుంటాము అని విసురుగా మాట్లాడాడు."ఉరుము ఉరిమి....వాడిమీద పడ్డట్లు"ఆయనకు ఏమైనా చిరాకు ఉంటే ఆయనకే పరిమితం అంతేకానీ అంత వయసు వచ్చిఎదుటివాళ్ళతో ఏమి మాట్లాడుతున్నామనే
ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటమేమిటి?అని మనసులో అనుకుని అదేమిటి?వస్తామన్నారుకదా అంటే
నాభార్య అంతదూరం ప్రయాణం చేయలేదులే అన్నాడు.ఆవిషయం ముందే తెలుసుకదా అనుకుని సరేనండీ
అనేసింది శ్రీధరణి.ఏమిటో విచిత్రమైన మనస్తత్వాలు.

No comments:
Post a Comment