పిల్లలకు చిన్నప్పటి నుండే మగపిల్లలైనా,ఆడపిల్లలైనా ఎవరిపై ఆధారపడకుండా తమపనులు తాము చేసుకునేలా అలవాటు చేయాలి.ఈరోజుల్లో తల్లీ,తండ్రీ ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి.ఉదయం పాఠశాలకు వెళ్ళాలంటే పిల్లలున్న ఇంట్లో పెద్ద హంగామా.ఇంతకు ముందు రోజుల్లో నానమ్మ,తాతయ్య లేకపోతే అమ్మమ్మ ,తాతయ్య ఎవరో ఒకరు ఉండేవాళ్ళు.ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాలలో ఉండటం లేకపోతే అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడక పోవటం,ఏకారణమైనా అన్నిపనులు ఎవరికి వారే చేసుకోవాల్సిన పరిస్థితి.అందుకని పిల్లలకు వాళ్ళ పుస్తకాలు వాళ్ళే సర్దుకోవటం,బూట్లు వేసుకోవటం,బట్టలు వేసుకోవటం లాంటి చిన్నచిన్నపనులు చేసుకోవటం అలవాటు చేస్తే అమ్మ వచ్చిచేస్తుందనో,నాన్న వచ్చిచేస్తాడనో ఎదురు చూడకుండా ఉంటారు.తర్వాత నిదానంగావాళ్ళ పనులు చేసుకోవటమే కాక అమ్మకు,నాన్నకు చిన్నచిన్నపనుల్లో సహాయపడటం అలవాటవుతుంది.మనమే మన పనులు మనం చేసుకోము. ఇక పిల్లలకు ఏమి నేర్పుతాము అనుకోకుండా ముందు మనపద్దతులు మార్చుకుని పిల్లలకు మంచి పద్దతులు నేర్చుకునేలా చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు మనకు కూడా మంచిది.కొంచెం పెద్దయిన దగ్గరనుండి హాస్టళ్ళలో ఉండక తప్పని పరిస్థితి.ఒకేసారి ఇబ్బందిపడకుండా ఉండటమేకాక ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకోవటానికి అలవాటుపడతారు.
No comments:
Post a Comment