Friday, 7 November 2014

శత్రువు కాని శత్రువు

                                 లిఖిత,నిఖిత ఒకే రోడ్డులో ఉంటున్నా ఒకరితో ఒకరికి పరిచయంలేదు.లిఖిత ఎవరి గురించి
పట్టించుకోదు.నిఖిత ఎవరో,ఎలాఉంటుందోకూడా లిఖితకు తెలియదు. కానీ నిఖితకు ఊరందరి విషయాలు కావాలి. పరిచయం ఉన్నాలేకున్నావాళ్ళింట్లో అలాగంట,వీళ్ళింట్లో ఇలాగంట అంటూ చెప్పనిదే నిద్రపట్టదు.ఉదయం లేచింది మొదలు ఇంటింటికి తిరుగుతూనే ఉంటుంది.ఒకసారి లిఖిత కూతురు లేఖిని స్నేహితురాలు నమిత, లిఖిత  ఇంటికి వచ్చింది.పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు హరిత ఇల్లు ఇదేరోడ్డులో ఉంది.నేను ఒకసారి వాళ్ళింటికి వచ్చాను అని చెప్పింది.హరిత నిఖిత కూతురని తెలిసింది.నమిత హరిత ఇంటికి వెళ్ళింది.కొంచెంసేపటి  తర్వాత నువ్వు లేఖిని ఇంటికి వచ్చావా? అని నిఖిత హరితను అడిగింది.అవును ఆంటీ,నేను,లేఖిని స్నేహితురాళ్ళము అనగానే ఏంటి
లేఖినిని పెద్ద చదువుకోసం చాలా డబ్బుఖర్చుపెట్టి పంపుతున్నారంటగా?నాకూ డబ్బున్న మొగుడొస్తే నేనూ నా కూతుర్ని చదివించుకునేదాన్నిఅని నమితతో అంటే నమితకు అర్ధంకాక వచ్చిఆఆంటీ ఇలా అన్నారు అని లేఖినికి చెప్పింది.లేఖిని వాళ్ళ అమ్మ లిఖితకు చెప్పింది.అదేంటి?ఆమె ఎవరో?నాకు ముక్కు,మొహం కూడాతెలియదు.
ఆమెను ఎప్పుడూ చూడలేదు.ఆమె మాట్లాడింది నన్ను ఉద్దేశించేనని లిఖిత చెప్పింది.ఆమెకు డబ్బులేదు కనుక
లిఖితకు డబ్బుందని ఈర్ష్య కాబోలు.ఇలాగే తర్వాత కూడా వీళ్ళ గురించి చెడుగా కాకపోయినా ఏదోఒకటి తెలిసికొన్ని తెలియక కొన్ని మాట్లాడుతుందని తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పటం మొదలు పెట్టారు.ఇప్పుడు ఇలాంటి వాళ్ళే ఎక్కువమంది ఉంటున్నారు.ఈమె మనకు శత్రువు కాని శత్రువు అన్నమాట అని లిఖిత,లేఖిని అనుకున్నారు.                     

1 comment:

  1. http://www.netitelugu.com/telugu/kamalhasan-birthday/

    భారతీయ సినీనటుల్లో విలక్షణనటుడిగా పేరు తెచ్చుకున్నకమల్ హాసన్ పుట్టినరోజు నేడు. 60ఏళ్ల కమల్ నాలుగేళ్ల పసి వయసులోనే కళామతల్లి ఒడికి చేరాడు. తొలిచిత్రంతోనే బాల నటుడిగా (కలత్తూర్ కన్నమ్మ) రాష్ట్రపతి అవార్డును, బంగారు పతకాన్ని అందుకున్నారు. కళలకు సంబంధం లేని కుటుంబంలో పుట్టిన కమల్ ఈరోజు భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారు. 1954 నవంబర్ 7న రామనాథపురం జిల్లా పరమకుడిలో జన్మించిన కమలహాసన్ తండ్రి డి.శ్రీనివాసన్ న్యాయవాది.

    ReplyDelete