లేత నేతిబీరకాయ - 1
పచ్చి మిర్చి -10
వెల్లుల్లి - 6 గర్భాలు
టొమాటో - 2
చింతపండు - నిమ్మకాయంత
తాలింపు కోసం :
ఎండు మిర్చి -1
దినుసులు
వెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.
కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం
ఉప్పు - సరిపడా
కార్తీకమాసం వచ్చిందంటే చాలు నేతిబీరకాయ తింటే మంచిదని ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు.ఊరులో అయితే ఒకళ్ళకి ఉంటే బంధువులకు,స్నేహితులకు,ఇరుగుపొరుగు అందరికీ పంపిస్తారు.కొన్ని చోట్ల కురగాయలతోపాటు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు.కూర కన్నా పచ్చడి బాగుంటుంది.ఎక్కువగా పచ్చడి మాత్రమే చేస్తారు.ఉపవాసం ఉండి ఈ పచ్చడి తింటే మంచిదని పెద్దలు తప్పకుండా తినాలని చెప్తుంటారు.
ముందుగా నేతిబీరకాయ కడిగి ముక్కలు కోసి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి తీసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.తర్వాత నేతిబీరకాయ ముక్కలు ఉప్పు వేసి మ్రగ్గనివ్వాలి.నీరు ఇగిరిపోయిన తర్వాత తీసేయ్యాలి.టొమాటో ముక్కలు కూడా వేయించి,వెల్లుల్లి అన్నీకలిపి రోట్లో కానీ,మెత్తగా కావాలంటే మిక్సీలో కానీ వెయ్యాలి.దీన్ని బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు పెట్టాలి.కరివేపాకు,కొత్తిమీర వేసి,పచ్చడి కూడా వేసి ఒకసారి త్రిప్పితే ఘుమఘుమ లాడుతూ మంచి వాసన వస్తుంటుంది.అంతే నోరూరించే నేతిబీరకాయ పచ్చడి రెడీ.ఉపవాసం ఉండి గుడినుండి వచ్చిన తర్వాత ఎన్నిపదార్ధలతో భోజనం చేసినా వేడివేడి అన్నంలో నేతిబీరకాయ పచ్చడితో తింటే ఆ రుచే వేరు.

No comments:
Post a Comment